–ప్రసిద్ధ పుణ్య క్షేత్రం టీటీడీలో పర్యావరణ పరిరక్షణ పద్ధతులు –గ్లోబల్ మోడల్‌గా మార్చాలనుకుంటున్న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ –ఇంధన సామర్థ్య చర్యలతో విద్యుత్ వినియోగం తగ్గించే చర్యలు –హైదరాబాద్‌లో పర్యావరణ నిర్వహణపై అంతర్జాతీయ సదస్సులో వెల్లడి విజయవాడ: భారత ప్రభుత్వం చేపట్టిన మిషన్ లైఫ్ (లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్)లో భాగంగా విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సుస్థిర జీవనం, దక్షిణ భారతదేశం […]
Read Moreహర్యానా హరికేన్ మళ్లీ బీజేపీనే
– హర్యానాలో బీజేపీ హ్యా‘ట్రిక్’ – కాంగ్రెస్ కూటమి ఖాతాలో జమ్ము కాశ్మీర్ – జమ్ములో బీజేపీ హవా – హర్యానాలో ఫలించని ఎగ్జిట్‌పోల్స్ జోస్యం – కాంగ్రెస్ కూటమి ఖాతాలో మరో రాష్ట్రం – ఎన్నికల ఫలితాల్లో చెరో రాష్ట్రం పంచుకున్న రెండు కూటములు ( మహానాడు ప్రధాన ప్రతినిధి) హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ, ఇండి కూటమి చెరో రాష్ట్రంలో విజయం […]
Read More‘వైసీపీ నేతలకు వేధింపులు’
గుంటూరు, మహానాడు: నగరంలోని రాజేంద్రనగర్ వైసీపీ స్థానిక కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అధ్యక్షతన తెనాలి నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి నుండి పార్టీ కమిటీలను, ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం రోజురోజుకూ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, పాలనపై దృష్టి పెట్టకుండా […]
Read Moreహర్యానా ప్రజలకు సెల్యూట్
– జమ్మూ కశ్మీర్ లో బీజేపీ సాధించిన ఫలితాల పై గర్విస్తున్నా – ప్రధాని నరేంద్ర మోదీ హర్షం ఢిల్లీ: హర్యానా ప్రజలు హృదయపూర్వకంగా తమను ఆశీర్వదించారని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీకి మరోసారి స్పష్టమైన మెజారిటీ ఇచ్చిన హర్యానా ప్రజలకు, సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా […]
Read Moreప్రతి హామీ అమలుకు ప్రభుత్వం కృషి
– ‘ప్రజాదర్బార్’ లో ఎమ్మెల్యే కన్నా సత్తెనపల్లి, మహానాడు: రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని, వినతులు స్వీకరించారు. పట్టణంలోని 24వ వార్డలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఏమన్నారంటే.. ఇచ్చిన ప్రతి హామీ అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం మాది. ప్రజా ప్రభుత్వం ప్రతి […]
Read Moreరేవంత్ రెడ్డి పై డీఎస్పీకి జోగు రామన్న ఫిర్యాదు
ఆదిలాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ, రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచి రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి, రుణమాఫీ విషయంలో అబద్ధాలు చెబుతున్నారని, ఆయన వ్యాఖ్యలతో రైతులు ఆందోళనకు గురవుతున్నార ని, ఆ […]
Read Moreబ్లాక్‌మార్కెట్ మాఫియా తాట తీయండి
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కలకలంగా మారిన ఎరువులు, పురుగుమందుల నకిలీ, కల్తీ, బ్లాక్‌మార్కెట్ మాఫియా తాటతీయాలని అధికారులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశించారు. రైతులకు నష్టం జరిగే ఏ పనినీ ఈ ప్రభుత్వం సహించదు, చర్యలు చాలా కఠినంగా ఉంటాయనే సందేశం అందరికీ చేరాలన్నారు. అందుకోసం అవసరమైతే లైసెన్స్‌ల రద్దుతో పాటు క్రిమినల్ కేసులు పెట్టడానికి వెనకాడొద్దని, ఎలాంటి […]
Read Moreవిధుల పట్ల అలసత్యం వహిస్తే వేటు
– ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: పట్టణంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక మల్లమ్మ సెంటర్, స్టేషన్ రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు, రావిపాడు నుండి ప్రధాన రహదారులు వెంబడి పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. మురికి నీరు చెత్తాచెదార్థం పేరుకుపోవడాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. కాలినడకన పలు సచివాలయాలకి చేరుకొని సిబ్బందితో మాట్లాడారు. వారి విధుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సచివాలయ […]
Read More‘తెలుగు’ విశ్వవ్యాప్తికి ఆంధ్ర సారస్వత పరిషత్ కృషి
– గజల్ శ్రీనివాస్ గుంటూరు, మహానాడు: మూడో ప్రపంచ తెలుగు మహాసభల(2026) కు ముఖ్య సమన్వయకర్తగా గుంటూరు నగరానికి చెందిన ప్రముఖుడు పి.రామచంద్ర రాజుని నియమించినట్టు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కేశిరాజు శ్రీనివాస్( గజల్ శ్రీనివాస్) తెలిపారు. నగరంలోని భారతీయ విద్యా భవన్ లో మంగళవారం నిర్వహించిన ఆంధ్ర సారస్వత పరిషత్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణే […]
Read Moreఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణంలో ప్రతి బాధితుడికి న్యాయం జరగాలి
– ఎమ్మెల్యే ప్రత్తిపాటి చిలకలూరిపేట, మహానాడు: ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణంలో నష్టపోయిన ప్రతిఒక్క బాధితుడికి న్యాయం జరగాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. మాజీ మేనేజర్, గోల్డ్ అప్రైజర్ కలిసి కోట్లాది రూపాయలకు మోసం చేస్తుంటే బ్యాంకు యంత్రాంగం కళ్లు మూసుకుందా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట చిలకలూరిపేట అనుకుంటే నరసరావుపేటలోనూ ఇదే తరహా మోసం వెలుగుచూడడం, అదే మేనేజర్ […]
Read More