రతన్ టాటా మృతిపై బూరగడ్డ వేదవ్యాస్ దిగ్భ్రాంతి

మచిలీపట్నం, మహానాడు: రతన్ టాటా మృతిపై మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. రతన్ టాటా మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. మేకిన్ ఇండియా నినాదంతో ముందుకు సాగిన టాటా ప్రయాణం చిరస్మరణీయం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా టాటా ప్రస్థానం సాగింది. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడంపైనే టాటా ఎక్కువ శ్రద్ధ చూపారు. విపత్తుల సమయంలో ఆపన్న హస్తం అందించడంలో టాటాకు సరిలేరెవ్వరూ.. రతన్ టాటా లాంటి దిగ్గజం మరణ వార్త అత్యంత బాధాకరం. టాటా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.