టాటా మృతికి ఎంపి కేశినేని శివనాథ్ సంతాపం
విజయవాడ : దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగ పురోగతిలో కీలకపాత్ర పోషించిన అసాధారణ మానవతావాది రతన్ టాటా మృతి భాధాకరం. ఆయన మరణం పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. రతన్ టాటా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ఎంపి కేశినేని శివనాథ్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రతన్ టాటా మృతి పట్ల విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. 2015లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా వున్న సమయంలో విజయవాడ పార్లమెంట్ నియోజకర పరిధిలో 264 గ్రామాలను టాటా ట్రస్ట్ అభివృద్ది చేయటానికి ముందుకొచ్చిందన్నారు .ప్రజల హృదయాల్లో రతన్ టాటా ఎప్పటికీ జీవించే ఉంటారని సమాజానికి టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలందించారని గుర్తు చేశారు.
సేవలో రతన్ టాటాను మించినవ వారు లేరన్నారు. భారతదేశం ఇప్పటి వరకు చూసిన గొప్ప దార్శనికుల్లో రతన్ టాటా ఒకరని కొనియాడారు. మన దేశ నిర్మాణంలోను అద్భుతంగా కృషి చేశారన్నారు. సమాజ హితుడుగా.. తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ రతన్ టాటా ఆదర్శమని అన్నారు.