– చిన్నబోయిన అమ్మవారి భక్తులు
– ఆలయ పవిత్రతను దెబ్బతీశారు
– ఇంగితజ్ఞానం లేదా అని శాపనార్థాలు
– ఆలయాలపై ఇంకా చిన్నచూపు సాగుతోందని విమర్శలు
– ఎన్డీయే సర్కారు తక్షణం చర్యలు తీసుకోవాలి
– లేనిపక్షంలో పోలీస్ కమిషనర్ ఆఫీసు ఎదుట నిరసన
– హిందూ సంఘాల హెచ్చరిక
విజయవాడ, మహానాడు: ఇంద్రకీలాద్రిపై పోలీస్ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో భక్తులు చిన్నబోయారు. చినరాజ గోపురం వద్ద ఏపీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాజారెడ్డి బూట్లతో హల్‌చల్ చేశారు. నిబంధనలను పక్కన పెట్టి బూట్లతో ఆలయంలోకి ప్రవేశించడంతో భక్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన వారికి అమ్మవారి దర్శనం చేయించేందుకు ఆలయంలోకి రాజారెడ్డి ప్రవేశించారు. ఆలయ పవిత్రతను దెబ్బ తీశారని, కనీసం ఇంగితజ్ఞానం లేదా అని భక్తులు శాపనార్థాలు పెట్టారు. ఆలయ నిబంధనలను ఉల్లంఘించిన ఆ ఎస్‌ఐ హిందూ పేరు గల అన్యమతస్తుడై ఉంటాడన్న అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో భక్తులతో నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసనలు చేపడతామని హిందూ సంఘాలు హెచ్చరించాయి.