లాంచ్ ప్రయాణం ప్రారంభం

సాగర్, మహానాడు: నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని పర్యాటక శాఖ ప్రారంభించింది. 120 కిలో మీటర్లు, 6 గంటల ప్రయాణంలో, నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల అటవీ అందాల మధ్య ఈ అద్భుత ప్రయాణం సాగుతుంది. తెలంగాణ ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ బోటు ప్రయాణాన్ని కార్తీక మాసం తొలిరోజు శనివారం పర్యాటక శాఖ ప్రారంభించింది. ప్రస్తుత వర్షాకాల సీజన్లో విస్తృతస్థాయిలో వర్షాలు పడడం వల్ల కృష్ణానది తీరం వెంట, అటు శ్రీశైలం నుండి ఇటు నాగార్జున సాగర్ డ్యాం వరకు గరిష్ఠ మట్టంలో నీటి లభ్యత ఉండటం వల్ల రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.