నెల్లూరు, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జిల్లా కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. సాగునీటి సంఘాల ఎన్నికలు, కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నియోజకవర్గాల వారీగా కూటమి నాయకుల మధ్య సమన్వయం, జిల్లా అభివృద్ధి కొరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, దేవాలయ పాలక మండళ్ళు, ఏఎంసీ కమిటీలు, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీ, అధ్యక్షులు వారి అనుమతి తో ఇతర అంశాలు అజెండాగా సమావేశం సాగింది.
జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఎండి ఫరూక్, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కందుకూరు శాసన సభ్యుడు ఇంటూరి నాగేశ్వరరావు, కావలి శాసన సభ్యుడు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కోవూరు శాసన సభ్యుడు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు వేములపాటి అజయ్ కుమార్, నూనె మల్లికార్జున యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.