సాంస్కృతిక రంగానికి పెద్ద పీట

– ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు

గుంటూరు, మహానాడు: కవి, గాయకుడు పీవీ రమణకు జాషువా సాహిత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ కవికోకిల జాషువా పురస్కారం అందించింది. ఈ సందర్బంగా మాజీ మంత్రి, వేమూరు శాసన సభ్యుడు నక్కా ఆనంద్ బాబు ప్రజా గాయకుడు పి.వి.రమణను తన గుంటూరు క్యాంప్ కార్యాలయంలో అభినందనలు తెలిపి సత్కరించారు. నక్కా ఆనందబాబు మాట్లాడుతూ పి.వి.రమణ గాయకుడిగా, రచయితగా తెలుగు సాహిత్యానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం రావడం ఆనందదాయకమని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో సాంస్కృతిక రంగానికి పెద్ద పీట వేస్తుందని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కళాకారుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు.

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గొళ్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ గుర్రం జాషువా పురస్కారం తో సత్కరించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. రమణ విద్యార్థి దశ నుండే అభ్యుదయ భావాలతో ముందుకు సాగుతున్నారని భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధింన్నచాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బోరుగడ్డ వెంకటరావు, తెనాలి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రమణను ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు అభినందించారు. గుంటూరు నగరానికి చెందిన ప్రముఖులు అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక గౌరవ అధ్యక్షుడు పి.వి.మల్లికార్జునరావు, భారతీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిగురుపాటి రవీంద్రబాబు, సాంస్కృతి వ్యవస్థాపక అధ్యక్షుడు సర్రాజు బాలచందర్, ప్రఖ్యాత కవి కత్తి పద్మారావు, ప్రముఖ వ్యాపారవేత్త బొమ్మిడాల శ్రీకృష్ణ మూర్తి, ప్రముఖ విద్యావేత్తలు పి.వి.శంకర్రావు, భాష్యం రామకృష్ణ, వీవీఐటి వాసిరెడ్డి విద్యాసాగర్, వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, బాస సంపాదకుడు ఎన్‌జే విద్యాసాగర్, భీం సేనా సేవాదల్ అధ్యక్షుడు నల్లపు నీలాంబరం, రంగం రాజేష్, బిళ్ళా నాగరాజు, తదితరులు అభినందనలు తెలిపారు.