రోగులకు వరం… ఎన్టీఆర్ వైద్య సేవ పథకం

– జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్

వినుకొండ, మహానాడు: ఎన్టీఆర్ వైద్య సేవ పథకం రోగులకు వరంలాంటిందని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించారు. ఎన్టీఆర్ వైద్య సేవ రోగుల వార్డులు, రికార్డులు తనిఖీ చేశారు. వైద్య సదుపాయాలపై రోగులను అడిగితెలుసుకున్నారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ వార్డులను పరిశీలించారు. ఉచితంగా భోజనం, మందులు, శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సీజన్‌లో వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ రజాక్, వైద్య మిత్ర మాచర్ల బుజ్జి, టీమ్ లీడర్ ప్రశాంతి రత్నం, డీఈఓ, సాగర్ హాస్పటల్ సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.