Mahanaadu-Logo-PNG-Large

ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు

– నేడో, రేపో పదవికి రాజీనామా చేసే అవకాశం

తిరుపతి, మహానాడు: తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో సస్పెండ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు అయింది. బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్స్ వల్ హెరాస్ మెంట్ చేస్తూ, శారీరకంగా అనుభవిస్తూ, తనని రేప్ చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. భీమాస్ పారడైజ్ రూమ్ నంబర్ 105, 109 లో నా ప్రమేయం లేకుండా అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో BNS Cr:430/2024 నమోదు అయింది. భీమాస్ పారడైజ్ హోటల్ లో సి.సి. పుటేజీని ఈస్ట్ పోలీసులు సేకరించారు.