– రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
కోనసీమ జిల్లా, మహానాడు: రాష్ట్రంలో 2014- 19 మధ్య కాలం స్వర్ణ యుగమైతే 2019-24 మధ్య చీకటి యుగం నడిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమ జిల్లాలోని స్వర్ణ వానపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో పాల్గొని, మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13, 226 అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆ మేరకు ఈ రోజు గ్రామ సభలు నిర్వహించుకుంటున్నాం. స్వర్ణ వానపల్లి గ్రామ సభలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను
సింపుల్ గవర్నమెంట్, సింపుల్ గవర్నెన్స్ విధానంలో పనిచేసే సాదాసీదా ప్రభుత్వం .. ఇది పేద ప్రజల ప్రభుత్వం.. ఉపాధిహామీ పథకం నిధులతో 40/60 శాతం నిష్పత్తితో గ్రామాల అభివృద్ది చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం… గతంలో మన ప్రభుత్వం హయంలో 40 శాతం సిమెంట్ రోడ్లు నిర్మించుకున్నాం.. రాబోయే 5 ఏళ్ళల్లో అన్నీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మిస్తాం… అందులో భాగంగా 17,500 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపడతాం. .. 10 వేల కిలో మీటర్ల మేర డ్రైనేజీ, 2500 కిలో మీటర్ల బీటీ రోడ్లు, రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇంకుడు గుంతలు, లక్షా యాభై వేల పశువుల షెడ్ల నిర్మించనున్నాం. ఉపాధిహామీ దిన సరి వేతనం పెంచే దిశగా అడుగులు వేస్తాం..
ప్రతీ ఒక్క ఇంటికి కుళాయి, గ్యాస్ కనెక్షన్, మరుగుదొడ్డి నిర్మించి స్వచ్ఛంద ఆంధ్రపదేశ్ నా లక్ష్యం… మెగా డిఎస్సీ ద్వారా రాష్ట్రంలో 16, 340 మందికి యువతకు ఉద్యోగావకాశాలు.. నిరుద్యోగ యువతకు ఉపాధి ప్రోత్సాహకం ఉంటాయి… పేదలను ప్రతినెలా ఒకటో తేదీన అధికారులు కలవాలని పేదల ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ చేశాం… వలంటీర్ లు లేకుండా ఇంటింటి పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదు అన్నారు … ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా తొలి రోజే 99 శాతం మందికి పింఛన్లు పంపిణి చేశాం.. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం … తద్వారా యువతలోనూ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టనున్నాం..