అర్హులకు పక్కా గృహం… ప్రభుత్వ ధ్యేయం

– గృహనిర్మాణ సంస్థ చైర్మన్ తాతయ్యబాబు

విజయవాడ, మహానాడు: రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేద వాడికి పక్కా గృహం నిర్మించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు తెలిపారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ గా నియమితులైన తాతయ్యబాబు గురువారం విజయవాడలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అన్ని సౌకర్యాలతో గృహాలు నిర్మించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ధ్యేయమని, ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా గృహాల నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు.