జగన్‌ పరిపాలనతో ఒక తరం నాశనం

లక్షలు ఇచ్చినా వైసీపీ గెలుపు అసాధ్యం
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి, మహానాడు : జగన్‌ పరిపాలనతో ఒక తరం నాశనమైందని, ప్రజలు ఆయనను ఎప్పటికీ క్షమించరని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో ఆయన ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్షలు ఇచ్చినా జగన్‌ పార్టీకి ఓటు వేయటానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ప్రచారంలో ఆయన వెంట నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ముందుగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి గ్రామస్తులు పెద్దఎత్తున స్వాగతం పలికారు.