పార్టీ ఓటమితో టీడీపీలో చేరేందుకు సిద్ధం
జంపింగ్స్ బాటలో మరికొందరు నేతలు
అమరావతి: కూటమి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనున్న నేపథ్యం లో ఈలోపే వైసీపీ నుంచి జంపింగ్స్ స్టార్ట్ అయ్యాయి. వైసీపీ ముఖ్యనేత రావెల కిషోర్‌బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతో సాధ్యం అవుతోందని ప్రకటించారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని స్పష్టమవుతోంది. ఆయన బ్యూరోక్రాట్ పదవి వదిలి 2014 అసెం బ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు హయాంలో ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019లో టీడీపీ ఓడిపోవడంతో వైసీపీలో చేరారు. తర్వాత బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఏపీ వ్యవహారాలను కొద్ది రోజులు చూశారు. అంతలోనే మళ్లీ వైసీపీకి వచ్చేశారు. ఇటీవల జరిగిన ఎన్నిక ల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు.