సుపరిపాలన అందించేందుకు దృష్టిపెట్టాలి
సబ్‌కా సాత్..సబ్ కా వికాస్ లక్ష్యంతో పనిచేయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
విజయవాడ: నగరంలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబును బలపరిచన అనంతరం ప్రసంగిస్తూ అనూహ్యమైన విజయాన్ని సాధించాం. గడిచిన ఐదు సంవత్సరాలలో ప్రజలు అనేక ఓడి దుడుకులు ఎదుర్కొన్నారు. ఒక విధ్వంస పాలనతో ఇబ్బందులకు గురయ్యారు. ప్రజా వ్యతిరేక పాలనను అంత మొందించటానికి ప్రజలు ఓటుతో సరైన నిర్ణయం తీసుకున్నారు. విజయం నుంచి మనం కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. రాష్ట్రం అభివృద్ధి చేయటానికి కృషి చేయాలి. అధికారంలోకి వచ్చామన్న భావం కంటే ప్రజలకు సరైన సుపరిపాలన అందించే విధంగా ఉండాలి. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంతో పనిచేయాలి. మూడు పార్టీల ఆవిర్భావం చూస్తే ప్రజల కోసం ఆలోచించే విధానం. అందుకే ఈ మూడు పార్టీల కలయిక అనేది త్రివేణి సంగమం లాంటిది. ప్రజా సంక్షేమ పాలనను ఏ విధంగా అందిం చాలనే దానిపై దృష్టిపెట్టాలని కోరారు.