యువకుడిని బలితీసుకున్న మొబైల్‌ గేమ్‌!

గంగుపల్లి, మహానాడు: మొబైల్‌ గేమ్‌ యువకుడిని బలి తీసుకున్న సంఘటన గంగుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు డి ఇమ్మనుయేలు (21) శుక్రవారం రాత్రి పూట 10:39 గం|| మొబైల్ తీసుకుని గేమ్ ఆడుకుంటూ బిల్డింగ్ పైకి వెళ్ళాడు. గేమ్‌ అడుతునే పైనుంచి జారి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం వల్ల గుంటూరు జనరల్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోయింది. ఆ యువకుడు ఈ లోకాన్ని వీడాడు.