ఇక అమరావతికి కొత్త కళ

ప్రమాణస్వీకారం లోపు పరిశుభ్రత పనులు
యుద్ధప్రాతిపదికన యంత్రాలతో చిల్లచెట్ల తొలగింపు
రహదారులను బాగుచేయిస్తున్న అధికారులు
కరకట్టపై విద్యుద్దీపాల పునరుద్ధరణకు చర్యలు
కొత్త ప్రభుత్వంతో సీఆర్‌డీఏలో కదలిక
ఆగిపోయిన భవన నిర్మాణాలపై సీఎస్‌ ఆరా
విధ్వంస పాలన నుంచి కోలుకుంటున్న ప్రజలు

అమరావతి: ఐదేళ్ల విధ్వంసం, అరాచకానికి ప్రత్యక్ష నిదర్శంగా నిలిచిన రాజధా ని అమరావతి ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటోంది. రాజధాని అమరావతిలో గడచిన ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టకుండా దాన్నో చిట్టడివిలా మార్చేసిన సీఆర్‌డీఏలో కదలిక మొదలైంది. రాజధానిలో పిచ్చిమొక్కలు తొలగించే కార్యక్ర మాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. రాజధానికి ప్రమాణస్వీకారం చేసిన చోట ఏర్పాటు చేసిన గ్యాలరీని వైసీపీ హయాంలో దుండగులు ధ్వంసం చేసినా చీమకుట్టినట్టయినాలేని సీఆర్‌డీఏ అధికారులు ఆదివారం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి గ్యాలరీని పునరుద్ధరించే పనులు చేస్తున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ఆదివారం రాజధానిలో పర్యటించి తాజా పరిస్థితిని సమీక్షించారు.

యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు

వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర రాజధాని అమరావతి కూటమి గెలుపుతో కొత్త కళ సంతరించుకోనుంది. రాష్ట్రంలో ఎన్డీయే గెలుపు, అమరా వతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో సీఆర్డీఏ ఆఘమేఘా లపై పనులు ప్రారంభించింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండడంతో రాజధాని ప్రాంతంలో ముళ్ల కంపల తొలగింపు పనులు మూడు రోజులుగా ముమ్మరంగా జరుగుతున్నాయి. 25 ప్రాంతాల్లో 94 పొక్లెయినర్లతో 109 కి.మీ నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో కంపలను రేయింబవళ్లు తొలగిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారు లు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.

విద్యుద్దీపాల పునరుద్ధరణ

కరకట్టపై వెలగని విద్యుద్దీపాలను సీఆర్‌డీఏ సిబ్బంది మారుస్తున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై రెండు దశల్లో 9.60 కోట్లతో ప్రారంభించిన సెంట్రల్‌ లైటింగ్‌ ప్రాజెక్టును తాజాగా పూర్తి చేశారు. కరకట్ట రోడ్డు, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ అధికారుల నివాస సముదాయాలకు వెళ్లేందుకు మార్గాలు లేవు. ఇవి ముళ్ల పొదలతో నిండిపోయాయి. వీటిని శుభ్రం చేస్తున్నారు. నిర్మా ణంలో ఉన్న న్యాయమూర్తుల బంగ్లాలు, న్యాయ సముదాయం, సచివాలయ టవర్లు, ఎన్జీవో అపార్ట్‌మెంట్లు, విట్‌ నుంచి సచివాలయానికి వెళ్లే మార్గం, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, అమృత విశ్వవిద్యాలయం, నవులూరులోని ఎంఐ జీ లే అవుట్‌, స్టేడియం, శాఖమూరు పార్కు, ఎన్‌ఐడీకి వెళ్లే మార్గాల్లో పెరిగిన ముళ్లచెట్లను కూడా తొలగిస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకా రం చేసే లోపు రాజధానిలో పరిశుభ్రత పనులను పూర్తి చేసేలా పనులు చేస్తున్నారు.

ఆగిపోయిన కట్టడాలపై ఆరా

అమరావతిలో సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆగిపోయిన భవన సదుపాయాలు, కట్టడాలను పరిశీలించారు. కరకట్ట రోడ్డు నుంచి మొదలుపెట్టి సీడ్‌ యాక్సెస్‌ రహదారిపై ఉన్న సెంట్రల్‌ లైటింగ్‌ను పరిశీలించారు. విద్యుద్దీపాల పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ రాజధానికి భూమి పూజ జరిగిన ప్రాంతం, శంకుస్థాపన శిలాఫలకాలు, పవిత్ర మట్టి, నీరు, అమ రావతి నమూనాలు ఉంచిన గ్యాలరీలను పరిశీలించారు. అనంతరం సీఆర్‌డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించారు. విజయవాడలోని సీఆర్‌డీఏ కీలక విభాగాలను ప్రాజెక్టు కార్యాలయంలోకి తరలించాలని సూచించారు. జంగిల్‌ క్లియ ంన్స్‌ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కట్టడాల పరిస్థితి గురించి సీఆర్‌డీఏ అధికారులను సీఎస్‌ అడిగి తెలుసుకున్నారు. భవనాల నాణ్యతపై ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సీఆర్‌డీఏ కమిషనర్‌ తీరుపై సీఎస్‌కు ఫిర్యాదు

సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ వ్యవహారశైలిపై రాజధాని రైతులు, మహిళ లు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. రెండేళ్లుగా కమిషనర్‌ అనుసరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్షిక కౌలు, ప్లాట్ల అభివృద్ధిపై తాము విజయవాడలోని ఆయనను కలిసి విన్నవించేందుకు ప్రయత్నించినా సరిగా స్పం దించలేదన్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత వార్షిక కౌలును త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు సీఎస్‌ హామీ ఇచ్చారు.