హిమాలయాల్లోని కొత్త శిఖరాన్ని అధిరోహించారు!

న్యూఢిల్లీ: హిమాలయాల్లో ఇప్పటివరకు ఎవరూ అధిరోహించని శిఖరాన్ని ‘జాతీయ పర్వతారోహణ, సాహస క్రీడల సంస్థ’కు చెందిన 15 మంది సభ్యుల బృందం అందుకుంది. ఈ సందర్భంగా ఆ శిఖరానికి ఆరో దలైలామా పేరిట ‘సాంగ్యాంగ్ గితో పీక్’గా నామకరణం చేశారు. అరుణాచలప్రదేశ్‌లో ఉన్న ఈ శిఖరం 6383 మీటర్ల ఎత్తు ఉంది. దీంతో బృంద సభ్యులను అరుణాచల్ సీఎం పెమా ఖండూ ప్రత్యేకంగా అభినందించారు.