– ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సభ్యత్వ నమోదును ఎక్కువగా చేసి, సరికొత్త రికార్డ్ సృష్టించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంగళవారం డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్, కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతి డివిజన్ లో 2000 లకు పైగా సభ్యత్వాలు చేయాలన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఒటర్లను నియోజకవర్గంలో అధికంగా చేర్చి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి మన్ననలు పొందామని, ఇదే స్ఫూర్తితో సభ్యత్వాలు కుడా అధికంగా చేయాలని కోరారు.
దాదాపు 100కు పైగా శాశ్వత సభ్యత్వాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. దీని కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని, మొన్న సార్వత్రిక ఎన్నికల్లో 50వేలకు పైగా ప్రజలు మనికి మెజారిటీని ఇచ్చారని, ఇప్పుడు కుడా అదే రికార్డు నెలకొల్పటానికి సిద్దంగా ఉండాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి కనకాచారి, కోవెలమూడి రవీంద్ర, మద్దిరాల మ్యాని, వేములపల్లి శ్రీరాం ప్రసాద్, శ్రీవల్లి, కొమ్మినేని కోటేశ్వరరావు, ఈరంటి వర ప్రసాద్, కసుకుర్తి హనుమంతరావు, ఆడక శ్రినివాస్, లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు.