విజయవాడ: వర్షాలు తగ్గడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది.బ్యారేజ్ వద్ద 11.41 లక్షల క్యూసెక్కుల నుంచి ప్రస్తుతం 11.31 లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గింది.రేపటికి మరింతగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం వరద తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నామని అధికారులు తెలుపుతున్నారు.ఇది విజయవాడ వాసులకు ఉపశమనం కలిగించే విషయం.