హైదరాబాద్, మహానగరం: సామాన్య ప్రజలకు ఒక రూల్.. మేయర్‌కు ఒక రూలా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయంలోకి వెళితే… పోలీసులు నగరంలో డీజేలను నిషేధించారు. బతుకమ్మ పండుగలో గురువారం డీజే లతో జీహెచ్ఏంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హోరెత్తించారు. ఇంకా.. తల్వార్ పట్టుకొని రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వచ్చినా.. ఏం చేయలేరు… నేనున్నా.. ఇవాళ ఈ తల్వార్ నేను పట్టుకున్నా, రేపు మీరు పట్టుకోవాలి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పలువురు విమర్శిస్తున్నారు.