టీడీపీలోకి పెద్దఎత్తున ముస్లిం మహిళలు
విజయవాడ: విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి మహ్మద్ పతావుల్లా, రాష్ట్ర తెలుగు మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా ఆధ్వర్యంలో వైసీపీ పార్లమెంట్ ప్రచార కార్యదర్శి షేక్ ఆషా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు మద్దతుగా 56వ డివిజన్ ఆర్.ఆర్.పేటకు చెందిన దాదాపు 350 మంది మైనార్టీ మహిళలు కూడా చేరారు. వారికి విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో సల్మా, లక్ష్మీ, షాహేదా, షేక్ నసీమా, నూర్జహాన్, లాల్ బీ తదితరులు ఉన్నారు.