Mahanaadu-Logo-PNG-Large

చీరాలలో వైఎస్సార్సీపీకి షాక్ 

చీరాల, మహానాడు :  వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు వైకాపాను వీడారు. మొత్తం 11 మంది వైకాపా, స్వతంత్ర కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎమ్.ఎమ్ కొండయ్య సమక్షంలో తెదేపాలో చేరారు. వారిని ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో మెరుగైన పాలన అందించేందుకు తమతో కలిసి ప్రయాణం చేసేందుకు కౌన్సిలర్లు ముందుకు రావడం హర్షనీయమన్నారు. అందరి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.