సోషల్‌ మీడియాపై ప్రత్యేక విభాగం

– సిఎం చంద్రబాబు

అమరావతి: సోషల్‌ మీడియా మీద ప్రత్యేకంగా ఫోకస్‌ పెడతామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్టు ట్రోల్‌ చేస్తే ఏం చేయొచ్చో.. చేసి చూపిస్తాం అన్నారు. సోషల్‌ మీడియా ట్రోలింగ్స్‌ కంట్రోల్‌ చేయడానికి ప్రత్యేక విభాగం పెడతామని ప్రకటించారు.

కక్ష సాధింపు ఆలోచన పక్కన పెట్టండి. బాధ్యతతో వ్యవహరించాలి.. ప్రజలకు సేవ చేయాలి అని సూచించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఓ రోజంతా శాంతి భద్రతలపై చర్చిద్దాం.. వివిధ వర్గాలు, ఉద్యోగులు, అమరావతి రైతులపై తప్పుడు కేసులు పెట్టారు. ఈ కేసులను ఏం చేయాలనే దానిపై సమీక్షిస్తాం. తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం ఖాయం అని స్పష్టం చేశారు.