– ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
కొత్తపేట : ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా కాకముందే హామీల అమలులో ముందడుగు వేస్తున్నామని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు.
ఈనెల 23వ తేదీన కొత్తపేట మండలంలో జరిగిన స్వర్ణ వానపల్లి గ్రామ సభలో భాగంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చి, 24 గంటలు గడవక ముందే లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసిన ఎలక్ట్రికల్ స్కూటర్లను లబ్ధిదారుల కోరిక మేరకు ఆయన ఆదివారం నాడు ప్రారంభించారు. కొత్తపేట మండలం వాడపాలెం కి చెందిన చింతపల్లి నాగమల్లేశ్వర కిరణ్, సంఘం పాలెం కు చెందిన ఇళ్ల భగవాన్ లకు ఒక్కొక్కరికి రూ1.50 లక్షల విలువైన ఎలక్ట్రికల్ స్కూటర్లను అందజేయడం సంతోషకరమని ఆయన అన్నారు. గత వైసిపి పాలనకు ప్రస్తుత కూటమి పాలనకు మధ్య వైరుధ్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో త్సమా బాబు, పల్లి భీమరావు, బండారు బుల్లి తాత, గనిశెట్టి వీరేష్, బండారు వీరరాఘవులు, పప్పులు బుజ్జి, కడియం చిన్న,చిక్కం హనుమంతు,కట్ట శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.