Mahanaadu-Logo-PNG-Large

యూకే పార్లమెంట్‌ బరిలో తెలుగుబిడ్డ

– లేబర్‌ పార్టీ అభ్యర్థిగా ఉదయ్‌ నాగరాజు
– ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా శనిగరం స్వగ్రామం

హైదరాబాద్‌, మహానాడు : బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీకి తెలుగుబిడ్డ ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం శనిగరకు చెందిన ఉదయ్‌ నాగరాజు లేబర్‌ పార్టీ నుంచి ఎన్ని కల బరిలో నిలుస్తున్నారు. నార్త్‌ బెడ్‌ ఫోర్డ్‌ షైర్‌ లేబర్‌ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటించింది. నార్త్‌ బెడ్‌ ఫోర్డ్‌ షైర్‌ బౌండరీ కమిషన్‌ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెం ట్‌ నియోజకవర్గం. ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలక్టోరల్‌ కాల్కులస్‌ ప్రకారం నియోజకవర్గంలో 68 శాతం లేబర్‌ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్‌లోనూ ఎన్నికల హడావిడి మొదలైంది. భారతదేశంలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనే బ్రిటన్‌, అమెరికాల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయిల్‌ -పాలస్తీనా సంఘర్షణ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రమా దం పొంచిఉన్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిటన్‌, అమెరికా ఎన్నికల మీద ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమైంది.

మధ్యతరగతి కుటుంబంలో జన్మించి..

కాగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్‌ నాగరాజు జన్మించారు. నాగరాజు హనుమంతరావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం ఉన్న ఉదయ్‌ అంచలంచలుగా ఎదిగారు. బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్‌ లండన్‌లో పాలనా శాస్త్రంలో పీజీ చేశారు. ప్రపంచ సమాజం, బావితరా లపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్‌ అనే థింక్‌ ట్యాంక్‌ను నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదిం చారు. క్షేతస్థ్రాయి సమస్యలపైన ఉదయ్‌కు మంచి పట్టు ఉంది. స్కూల్‌ గవర్నర్‌గా, వాలంటీర్‌గా, విస్స్తృత రాజకీయ ప్రచారకుడిగా ఒక దశాబ్దకాలంగా ఇంటింటికీ ప్రచా రంతో సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన సాధించారు.

లేబర్‌ పార్టీ వైపే అవకాశాలు

దాదాపు అన్ని సర్వే సంస్థల ప్రకారం ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ అఖండ విజయం సాధించి పభ్రుత్వం నెలకొల్ప నుంది. తెలుగు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కూడా ఈ సర్వేల ఆధారంగా కన్సర్వేటివ్‌ పార్టీ కనీవిని ఎరుగని రీతిలో ఓడిపోయి లేబర్‌ పార్టీ గెలుస్తుందని విశ్లేషిం చారు. గత కొన్ని ఎన్నికల్లోనూ లేబర్‌ పార్టీ ఎంపీలు వరుసగా గెలుస్తూ వస్తున్నా రు. ఈ నెలలో జరిగిన కౌన్సిలర్‌, రాష్ట్ర మేయర్‌ ఎన్నికలోనూ లేబర్‌ పార్టీ ఘనవిజయం సాధిం చింది. దీనితో తెలుగు ముద్దుబిడ్డ ఉదయ్‌ నాగరాజు కూడా బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.