మంగళగిరిలో ఏ టూ ఏ రన్

– ప్రారంభించిన హీరో నిఖిల్‌

మంగళగిరి, మహానాడు: మంగళగిరిలో ఏ టూ ఏ రన్‌ ఉత్సాహంగా సాగింది. ఎన్నారై జంక్షన్ నుంచి 3కె, 5కె, 10కె రన్ విభాగాలుగా జరిగింది.

సినీ హీరో నిఖిల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రన్‌లో యువత, విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు భారీగా పాల్గొన్నారు. గుండె జబ్బులపై అవగాహన పెంచేందుకు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు రన్ కార్యక్రమంలో పాల్గొన్నట్టు నిఖిల్‌ తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే… జీవనశైలిలో మార్పులే వ్యాధులకు కారణం. అందరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 5 వేల మందితో రన్ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం.

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారు. మంగళగిరిలో త్వరలో మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను.