వైసీసీ నాయకులు సహజ వనరులను దోచుకున్నారు
రాక్షస పాలనను ఓడించారు
కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, ఆరిమానిపెంట గ్రామంలో శ్రీమతి నారా భువనేశ్వరి మహిళలతో ముఖాముఖి
ఆరిమానిపెంట: కుప్పం ప్రజలకు, ఆరిమానిపెంట గ్రామస్తులకు, ముఖ్యంగా మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఓ పండుగ వాతావరణంలో నాకు మీరు పలికిన స్వాగతాన్ని మరచిపోలేను..ఈ స్వాగతం పలకడంలో మీ సంతోషం, మీ ఉత్సాహం నాకు కనిపించింది. నాకు మిమ్మల్ని చూడడం, కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
చంద్రబాబును మీరు నమ్మి 8సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. మీ నాయకుడిని మీరే 4సార్లు ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఈ ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. వైసీపీ పాలనలో ఏ విధంగా అరాచకాలు చేశారో మీరంతా గత ఐదేళ్లు చూశారు.
వైసీసీ నాయకులు సహజ వనరులను దోచుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిని 30ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయారు. కుప్పం ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు ఎప్పుడూ కష్టపడుతూ ఉంటారు. రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు అప్పుల్లో ముంచి, ఖజానాలో రూపాయి లేకుండా చేసినా.. చంద్రబాబు చెప్పిన విధంగా పెన్షన్లు పెంచి, 1వ తారీఖునే ఇంటి వద్దకు పెన్షన్లు అందించారు.
ఆగష్టు 15న అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ పాలనలో పోగొట్టుకున్న స్వాతంత్ర్యాన్ని తిరిగి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఓటును ఆయుధంగా చేసుకున్నారు. రాక్షస పాలనను ఓడించారు.
కుప్పం ప్రజలకు చంద్రబాబు చెప్పిన విధంగా కంపెనీలు తెస్తారు, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా యువతకు అవసరమైన కంపెనీలు, పరిశ్రమలు తెస్తారు. ఏపీకి పెట్టుబడిదారులు వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను చంద్రబాబు త్వరలోనే ఏర్పాటు చేస్తారు. చంద్రబాబు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఇంటింటికీ కుళాయి, డ్రైనేజీలు, వీధి లైట్లు వంటి మౌలిక సదుపాయాలు మీకు అందిస్తారు.
మహిళలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు అమలు చేస్తారు, మీకు అండగా నిలబడతారు. రామకుప్పం నియోజకవర్గంలో రూ.8.5కోట్లతో టమాటా ప్రాసెసింగ్ కంపెనీని తీసుకొస్తున్నారు. మీకు కానుకగా అందించబోతున్నారు.
పార్టీని నిలబెట్టేందుకు, రాక్షస పాలనను అంతం చేయడానికి కార్యకర్తలు చేసిన త్యాగాలను నేను మరువలేను. మీకు కృతజ్ఞతలు తెలిపేందుకే నేను మీ ముందుకు వచ్చాను. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశ ప్రజలు ఏ విధంగా సంతోషపడ్డారో, వైసీపీ పాలన పోయిన తర్వాత రాష్ట్ర ప్రజలు అంతే సంతోషంగా ఉన్నారు.
కుప్పం గడ్డ…చంద్రబాబు అడ్డా..అని కుప్పం ప్రజలు గత 40ఏళ్లుగా చాటి చెబుతూనే ఉన్నారు. కుప్పం గడ్డ…ముఖ్యమంత్రి అడ్డా అని మరోసారి మీరు రుజువు చేశారు. మా కుటుంబం కుప్పం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాం…మీకు ఏ కష్టం వచ్చినా మీకు మేమున్నాం.
పార్టీ, మా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది కుప్పం నియోజకవర్గం. మీ రుణం తీర్చలేనిది. మా కుటుంబంపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్న కుప్పం ప్రజలందరికీ మా కుటుంబం నుండి ప్రత్యేక ధన్యవాదాలు.
మీ కష్టసుఖాల్లో నేను పాలుపంచుకుంటాను…మీ ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాను. నేను చేయగలిగిన వరకు మీకు అండగా నిలబడి, నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. మీరు మీ సమస్యలపై ఇచ్చే ప్రతి అర్జీని పరిశీలించి, సమస్యలను పరిష్కరిస్తాను.