వ్యవసాయ కూలీని కరుణించిన అదృష్ట దేవత

తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో విలువైన వజ్రం లభ్యమైంది. పొలం పనులు చేస్తున్న వ్యవసాయ కూలికి వజ్రం దొరికింది. అదే పనిగా వజ్రాల వేటలో ఉన్నవారికి కూడా దొరకని విలువైన వజ్రం దొరికింది. దానిని ఓ వజ్రాల వ్యాపారి 12 లక్షల రూపాయల నగదు.. 5 తులాల బంగారం ఇచ్చి మరీ కొనుగోలు చేశాడు.