Mahanaadu-Logo-PNG-Large

‘సాక్షి’కి మనస్సాక్షే లేదు

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ 

• పిల్లలపై పిడుగు పేరుతో సాక్షిలో తప్పుడు రాతలు
• ఫీజులు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టింది వైసీపీనే
• వైసీపీ ప్రభుత్వంలో దాదాపు రూ. 3,480 కోట్ల బకాయిలు
• అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు చెల్లిస్తామని కల్లబొల్లి కబుర్లు
• 2023లో కట్టాల్సిన బకాయిలకు 2024 లో బటన్ నొక్కి డబ్బులు ఇవ్వలేదు
• తల్లుల ఖాతాలో డబ్బులు వేశామని మోసం చేశారు
• ఇప్పుడు ఫీజుల పేరుతో సిగ్గులేని రాతలు రాస్తున్నారు

మంగళగిరి , మహానాడు : టీడీపీ అధికారం చేపట్టి కనీసం 20 రోజులు కాకుండానే పిల్లలపై పిడుగు అంటూ సాక్షిలో తప్పుడు రాతలు, అబద్ధపు వార్తలు రాయడానికి కనీసం సిగ్గుండాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు. సాక్షిలో తప్పుడు రాతలు రాస్తుంటే సాక్షి ఎడిటర్ బుర్రలేకుండా అబద్దపు రాతలను ప్రోత్సహిస్తున్నారా అని విజయ్ కుమార్ ప్రశ్నించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యావసతి బకాయిలు దాదాపు రూ. 3,480 కోట్లు విద్యార్థులకు చెల్లించకుండా ఇబ్బంది పెట్టారని ఆగ్రహించారు. తల్లుల ఖాతాల్లో డబ్బులు వేశామని చెప్పి మోసగించారన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా  సమావేశంలో మాట్లాడారు.

నీలాయపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ… 

సాక్షి, వైసీపీ రెండు వేరు వేరు కాదు ఒక్కటే. వైసీపీ ఓడిపోయాక ఏం చేయాలో తెలియక పేపర్ ఉందని సిగ్గు శరంలేని రాతలు రాస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ కట్టలేదని తప్పుడు రాతలు రాస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చి సొమవారానికి 19 రోజులే అయ్యింది. అప్పుడే సాక్షి రోత రాతలు రాస్తోంది. ఒక్క ఛాన్స్ అని జనాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి వ్యవస్థలను సర్వనాశనం చేయడమే కాక ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు ఇలా రాయడం సిగ్గుచేటు. సాక్షికి ఎడిటర్ ఉన్నాడో లేడో… ఉంటే అతనికి బుర్ర ఉందో లేదో తప్పుడు రాతలను అబద్దపు రాతలను ప్రోత్సహిస్తాడా? సిగ్గు శరం లేకుండా సాక్షిలో వార్తలు రాస్తున్నారు కాబట్టే మైకు ముందుకు వచ్చి ప్రజలకు నిజం  చెప్పాల్సిన దుస్థితి వచ్చింది.

సాక్షిలో వచ్చిన వార్త ప్రకారం 2024 జూన్ నాటికి 3,480 కోట్లు విద్యార్థులకు ఫీజులు కట్టాలని చెబుతోంది. మూడు నెలలకు ఒకసారి కాలేజీలకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ చెల్లిస్తానని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఫీజులు కట్టకుండా వాయిదా వేసుకుంటూ వచ్చారు. గత సంవత్సరం 2023 జూన్ లో ప్రారంభమైన విద్యాసంవత్సరాన్నికి కేవలం ఒక్క త్రైమాసికానికి మాత్రమే డబ్బులు రిలీజ్ చేసింది. అది కూడా 2023 జూన్ లో కట్టాల్సిన వాయిదాకు 2024న మార్చి 1 పామర్రులో బటన్ నొక్కారు కానీ డబ్బులు వేయలేదు. 2023 జూన్ లో  విద్యా సంవత్సరం ప్రారంభం అయితే 2024 మార్చి వరకు ఒక్క రూపాయి కూడా ఎందుకు చెల్లించలేదో జగన్ రెడ్డే సమాధానం చెప్పాలి ? సంవత్సరం పాటు బకాయి పెట్టి  సిగ్గులేకుండా నేడు పిల్లలపై పిడుగు అంటూ రోత రాతలు రాస్తున్నారు. జగన్ రెడ్డి అప్పులు  పెట్టి.. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని  18 రోజుల్లోనే కట్టమని చెప్పడం కంటే దారుణం ఏమైనా ఉందా.

9,64,066 మంది విద్యార్థులకు ఫీజులు కట్టకుండా జగన్ రెడ్డి మోసం చేశాడు.  జగన్ రెడ్డి ఫీజులు కట్టకపోతే నానా అగచాట్లు పడి పిల్లలే ఫీజులు కట్టుకుని పరీక్షలు రాసుకున్నారు. సర్టిఫికేట్లు తీసుకున్నారు. మేము ఇప్పుడు దానికి పరిష్కారం కోసం చూస్తుంటే సిగ్గులేకుండా ఫీజులు కట్టలేదని  సాక్షిలో రాస్తున్నారు. రాసే వార్త తప్పు, అబద్దం అని తెలియడం లేదా. సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ ఏం చేస్తున్నారు ? 19 రోజుల్లోనే ఫీజులు కట్టాలని జగన్ రెడ్డి, ఆయన తోక పేపర్ ఎలా అడుగుతారు? తల్లిదండ్రుల అకౌంట్ లో డబ్బులు వేయకుండా మళ్లీ రోత రాతలు రాస్తారా? చేయాల్సింది అంతా చేసి రాష్ట్రంపై, విద్యార్థులపై పిడుగులు వేసి వారిని ఇబ్బంది పెట్టారు. అందుకే దారుణంగా ఓడిపోయారు. మీ అస్మదీయు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించుకున్న నీవు పిల్లల ఫీజులు ఎందుకు చెల్లించలేదు జగన్ రెడ్డి? సంవ్సతరం పాటు విద్యా వసతి రూ. 1200 కోట్లు ఎందుకు వేయలేదు ? మూడు సంవత్సరాల ఫీజు ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకు బాకీ పెట్టి పోయావ్ జగన్ రెడ్డి?

నీవు చెత్త రాతలు రాస్తుంటే మేము రోజు దానికి సమాధానం చెప్పాలా? ఫిజికల్ బేస్డ్ పద్దతిలో ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు చెల్లిస్తామని మీ జవహర్ రెడ్డి చేత చెప్పించిన విషయం మరచిపోయారా అప్పుడే.  మీరు మాత్రం ఫీజికల్ బేస్డ్ లో పద్దతిలో చెల్లిస్తారు. మేము మాత్రం మీరు పెట్టిన బకాయిలు ఒకేసారి చెల్లించాలా ఇదేమైనా న్యాయమా? ఖజానాను నిండుకుండలా పెట్టిపోయారా ఏమైనా.. మేము వెంటనే మీరు ఉంచిపోయిన బకాయిలన్నీ చెల్లించడానికి  జగన్ రెడ్డి. ఖజానాను ఖాళీ చేసి కాస్తైన ఇంగితం లేకుండా నీతిమాలిన రాతలు రాస్తారా మళ్లీ. రాష్ట్ర ప్రజలను దోచుకున్న డబ్బులన్నీ ఏం చేశారో ఎవరికీ తెలియదు. 2022 -23 బ్లాక్ లో 40,000  నుండి లక్షా ఐదువేలకు పెంచామని డబ్బా కొట్టుకుని మీ అనుకూల ఇంజనీరింగ్ కాలేజీలకు దోచి పెట్టారు. ఇప్పుడు ఇంకా ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఏ ఫీజులు ఇవ్వాలో స్పష్టం చేయలేదు. మూడు త్రైమాసిక బకాయిలు అలాగే ఉంది. విద్యా వసతి దీవేన అలానే ఉంది. ఇంత అప్పు పెట్టి విద్యార్థుల ఉసురు పోసుకుని  మళ్లీ వైనాట్ 175 అంటా సిగ్గులేకుండా.

విద్యావ్యవస్థను ప్రక్షాళనకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఎవరికి ఏ విధమైన భారం పడకుండా ప్రభుత్వం చూస్తోంది. ఖచ్చితంగా ఫీజులన్నీ చెల్లిస్తాం.. సర్టిఫికేట్లు అన్నివిద్యార్థులకు ఇవ్వమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్  మౌఖికంగా కాలేజీలను ఆదేశించారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ.. దశల వారీగా ఫీజులన్నీ చెల్లిస్తాం.. అందులో ఏ డౌట్ లేదు. ఏ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాలను నాశనం చేసి మళ్లీ చెత్త రాతలు రాస్తే వచ్చే ఓట్లు కాదు కాదా ఉన్న ఓట్లు పోవడం ఖాయం. విద్యార్థుల్లో భయోత్పాతాన్ని సృష్టించడానికి వైసీపీ యత్నిస్తోంది. ఇకనైన ఇటువంటి వెదవ రాతలు మానుకోవాలి.
ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వం ఇది. విద్యార్థులు ఏ రకమైన అభద్రతాభావానికి లోనుకావద్దని భరోసా ఇచ్చారు.