పమిడిపాడు శివారులో మహిళ హత్య!

నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, పమిడిపాడు శివారులో దారుణం జరిగింది. భార్య త్రివేణి(32)ని కత్తితో పొడిచి భర్త మురళి హత్య చేశాడు. అనంతరం పారిపోతుండగా కారంపూడి మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన మురళీని నరసరావుపేట లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. భర్త మురళి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. త్రివేణి స్వగ్రామం బెల్లంకొండ మండలం వన్నాయపాలెం. వీరికి ఇద్దరు మగా పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.