– బీజేపీ అధికార ప్రతినిధి యార్లగడ్డ రాంకుమార్
విజయవాడ: వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలుస్తుందన్న ఆరా మస్తాన్ సర్వేను ఎవరూ సీరియస్‌గా తీసుకోవలసిన పనిలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ రాంకుమార్ వ్యాఖ్యానించారు. ఆరా మస్తాన్ సర్వేను ఒక న్యూస్ ఐటెమ్‌గా మాత్రమే తీసుకోవాలన్నారు. ‘‘మస్తాన్ చిలకలూరిపేట ఎన్డీయే సీటు ఆశించారు. ఇవ్వలేదని కాస్త అసంతృప్తిలో ఉండేవాడు. ఆయన మా పార్టీలో ఉన్నాయన శిష్యుడే. అతను బీజేపీ-టీడీపీకి కాస్త టచ్‌లో ఉండేవాడు. ఐదేళ్లు ఏదో లైమ్‌లైట్‌లో ఉండాలి కాబట్టి చెబుతున్నాడు. కోపంతో అలా చెప్పాడు కాబట్టి మస్తాన్ సర్వేను పెద్దగా సీరియస్‌గా పట్టించుకోవద్దు’’ అని వ్యాఖ్యానించారు.