అబ్బో ..ఆయో షాబాను!

– జగన్ తో సెల్ఫీ తీసుకున్న జైళ్ళ శాఖ మహిళా పోలీసు
– ఆయో ష ఉ అతిపై విమర్శల వెల్లువ

గుంటూరు, మహానాడు: జగన్ పర్యటనలో జైళ్ల శాఖ ఉద్యోగి అత్యుత్సాహాం ప్రదర్శించారు. జైలు బయటి మీడియా సమావేశం వద్ద జగన్ వద్దకు జైళ్ల శాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఆయోషాబాను వచ్చారు. అన్న నేను నీ అభిమానిని అంటూ జగన్ వద్ద కేరింతలు కొట్టారు. అంతేకాకుండా జగన్ రెడ్డి తో సెల్ఫీ తీసుకున్నారు. ఆయోషాబాను తీరు పట్ల ప్రజానీకం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.