Mahanaadu-Logo-PNG-Large

భారత జాతి గర్వించదగ్గ వ్యక్తి అబ్దుల్ కలాం

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

విజయవాడ, మహానాడు: శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, విద్యార్థులకు మార్గనిర్దేశకునిగా, రచయితగా అసమాన ప్రతిభా పాటవాలు చూపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఆవుల్ ఫకీర్ జైనలుబ్దీన్ అబ్దుల్ కలాం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కలాం వర్థంతిని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్తానిక నేతలతో కలసి అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, ‘మిస్సైల్ మ్యాన్’గా భారత సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అసామాన్య ప్రజ్ఞాశాలి అన్నారు. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు.. పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానం యువతరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన స్వభావం ఎందరికో మార్గనిర్దేశం. ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అని కలాం చెప్పిన మంచి మాట యువతలో ఆత్మవిశ్వాసం నింపుతుందన్నారు. ఒక శాస్త్రవేత్తగా జీవితాన్ని ప్రారంభించిన కలాం. తర్వాత అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌కు ఎన్నో విజయాలు అందించారన్నారని పేర్కొన్నారు.