– గడువు ఈ నెల 9
అమరావతి, మహానాడు: నూతన మద్యం పాలసీ అమలుకు సంబంధించి మంగళవారం నుండి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించామని అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. దీనికి సంభందించిన ఆర్డినెన్స్ జారీ అయ్యుందని, దరఖాస్తులు మూడు విధాలుగా సబ్మిట్ చేయవచ్చన్నారు. పూర్తి ఆన్లైన్ విధానంలో డెబిట్, క్రెడిట్ కార్డుల నుండి పేమెంట్ ఒక విధానం కాగా, బ్యాంకు చలానా ద్వారా రెండో విధానమని తెలిపారు. మూడో పద్దతిలో డీడీ తీసుకుని నేరుగా రాష్టంలోని ఎక్సైజ్ స్టేషన్ ద్వారా అప్లికేషన్ పొందవచ్చని మీనా తెలిపారు. తొమ్మిదో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.