– కార్మికునికి తీవ్ర గాయాలు
ఉక్కునగరం, మహానాడు: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో మంగళవారం ప్రమాదం సంభవించింది. ఎస్ఎమ్ఎస్ -1 విభాగంలో ఉక్కుద్రవం ఒక్కసారిగా ఒరిగిపోయింది. దీంతో మల్లేశ్వరరావు అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హుటాహుటిన తోటి కార్మికులు క్షతగాత్రుని ఆస్పత్రికి తరలించారు.