జగన్‌పై గులకరాయి దాడి నిందితుడి విడుదల

కేసు ఒప్పుకోవాలని రివాల్వర్‌తో భయపెట్టారు
మీడియా ముందు వేముల సతీష్‌ ఆవేదన

అమరావతి: సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో నిందితుడు వేముల సతీష్‌ నెల్లూరు సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. గులకరాయి దాడి కేసుతో తనకెలాంటి సంబంధం లేదని, కేసు ఒప్పుకోవాలని పోలీసులు రివాల్వర్‌తో భయపెట్టారని కంటతడి పెట్టుకున్నాడు. అనంతరం తన న్యాయవాది, కుటుంబసభ్యులతో కలిసి విజయవాడకు పయనమయ్యారు.