– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
ఢిల్లీ: ఆదాని మోదీ బినామీ అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై ఇక్కడ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆమె విలేఖర్లకు వివరాలు అందించారు. దేశ వ్యాప్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ లో బిజెపి అనుసరించిన వైఖరి మీద చర్చ జరిగింది. సవివరంగా, ప్రజాస్వామ్య బద్దంగా అందరి అభిప్రాయాలను గౌరవించే సంప్రదాయం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉంది.
బీజేపీ ఏకపక్ష నిర్ణయాలపై దేశ వ్యాప్త పోరాటాలకు సిద్ధం అవుతున్నాం. బీజేపీ మైనారిటీల మనోభావాలను దెబ్బ తీసింది. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ మీద బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది. వక్ఫ్ చట్ట సవరణ మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవించడం లేదు. సెబీ ఆదాని అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. సెబీ ని తన గుప్పెట్లో పెట్టుకొని ఆదాని ని కాపాడుతున్నారు. కులగణన పై కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుంచి పోరాటాలు చేయబోతోంది. కులగణన అంశంపై పార్లమెంట్ లో కాంగ్రెస్ లెవనెత్తింది. అవినీతి రహిత పాలన అంటూ బీజేపీ గొప్పలు చెప్తుంది, కానీ ఆదాని- మోడీల అవినీతిని రాహుల్ గాంధీ ఎప్పుడో ఎండగట్టారు. ఆదాని మోడీ గ్రూప్, ఆదాని మోడీ బినామీ.
ఆదాని ని కాపాడే విషయంలో మోడీ చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతాం. క్షేత్రస్థాయిలోకి బీజేపీ అవినీతిని తీసుకెళ్లే కార్యాచరణ ఉండబోతుంది.