అమరావతి, మహానాడు: ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి యువరాజ్ కు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ కార్యదర్శిగా, ఏపీ మార్కెఫెడ్ ఎండీ మన్జీర్ లానీ సమూన్ కు స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, ఎండీగా ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ఎస్.రామసుందర్ రెడ్డికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండీ దినేశ్ కుమార్ కు రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సీఈవోగా బాధ్యతలు అప్పగించింది.