విలువలకు కట్టుబడే ఇపుడు పోటీ చేయడం లేదు

– హోంమంత్రి వంగలపూడి అనిత

విశాఖపట్నం, మహానాడు: విలువలకు కట్టుబడే ఇపుడు పోటీ చేయడం లేదని, వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయనివ్వలేదని హోంమంత్రి వంగలపూడి వ్యాఖ్యనించారు. మేము గెలవాలనుకుంటే మాకు ఈజీ. వైసీపీని వదిలి కూటమిలోకి చేరేందుకు అనేకమంది సిద్ధంగా ఉన్నారు. మండలి వద్దన్న వ్యక్తి ఇపుడు అభ్యర్థిని పోటీకి పెట్టారు. డ్రైవర్ ని చంపిన వాడు ఎమ్మెల్సీ. తాజాగా ఓ ఎమ్మెల్సీ సంగతి చూస్తున్నాం.

తన భద్రత గురుంచి జగన్ గగ్గోలు చేస్తున్నారు. జగన్ ఓ ఎమ్మెల్యే మాత్రమే అని గుర్తుంచుకోవాలి. అయినా 58 మందితో భద్రత ఇస్తున్నాం. జగన్ భార్యకు తల్లికి 2+2 సెక్యూరిటీ ఇస్తున్నాం. సీఎం గా వున్నప్పుడు స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నారు. 958 మందిని పెట్టుకుని వందల కోట్లు దుర్వినియోగం చేశారు. కూటమి హయాంలో భువనమ్మకు సెక్యూరిటీ ఇవ్వలేదు.