– ఏపీలో తొలగింపు.. మరుసటి రోజే తెలంగాణలో పదవి
ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆయన్ను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సలహాదారుగా నియమించింది. జగన్ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుగా ఉన్న ఆయన్ను నిన్ననే అక్కడి ప్రభుత్వం తొలగించింది. మరుసటి రోజే తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా నియమించడం విశేషం.