కౌంటింగ్‌ తర్వాత కేసులపై దర్యాప్తు వేగవంతం

ఇప్పటికీ 60 మందిని అరెస్టు చేశాం
పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌

నరసరావుపేట: పల్నాడు జిల్లాలో కౌంటింగ్‌ సందర్భంగా ఫలితాలు విడుదలైన తర్వాత నమోదైన కేసుల దర్యాప్తు వేగవంతం చేశామని, ఇప్పటికీ 60 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులో ఉన్నా కొంతమంది గుంపులుగా చేరి గ్రామాల్లో విచ్చలవిడిగా తిరు గుతూ ప్రభుత్వాస్తులను ధ్వంసం చేసి ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు చేసిన సంఘ టనలపై కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. జిల్లాలో వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు 38 కేసులు నమోదు చేసి 274 మందిని గుర్తించి 85 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కొంతమంది పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని వివరించారు. ఒక్కరోజే వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 72 మందిని అరెస్టు చేశామని తెలిపారు.

ప్రభుత్వ ఆస్తులైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌లపై దాడులు చేసినా, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసినా, వ్యక్తిగత దాడులకు పాల్పడినా వారిపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపించడం జరుగుతుందని హెచ్చరిం చారు. ప్రజలెవరూ గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడరాదని, కవ్వింపు చర్యలకు పాల్పడరా దని, విజయోత్సవ ర్యాలీలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.