Mahanaadu-Logo-PNG-Large

రెడ్లకు ఉన్న పేరును రోత పుట్టించిన జగన్మోహన్ రెడ్డి

-రాష్ట్రాన్ని నాశనం చేసినోళ్లు గవర్నర్ ను కలవడమా?
-దాడులను ప్రోత్సహించడం టీడీపీ చరిత్రలోనే లేదు
-మా దృష్టంతా వైసీపీ పాలనలో సర్వనాశనమైపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంపైనే
-మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

విజయవాడ: ఎన్నికల ఫలితాలు వచ్చాక జగన్మోహన్ రెడ్డి మాటల తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.రాష్ట్రం నాశనమైపోతోందంట, తెలుగుదేశం పార్టీ వాళ్లు దాడులు చేస్తున్నారంట..ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను విధ్వంసాలతో అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు.

కీలక శాఖలను మూత వేయడంతో పాటు వ్యవస్థలను సైతం నాశనం చేసేశారు. అంతా చేసి ఇప్పుడు మళ్లీ బీద ఏడుపులు ఏడుస్తుండటం విడ్డూరంగా ఉంది. వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి బీరాలు పలుకుతుంటే ప్రజలు మాత్రం వైనాట్ 164 అంటూ మా కూటమిని గెలిపించి ఆయనకు బుద్ధి చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేందుకు గవర్నర్ దగ్గరకు మేము వెళ్లాల్సిన సమయంలో వైసీపీ నేతలను పంపడం జగన్మోహన్ రెడ్డి రివర్స్ విధానంలో భాగమేమో.

మొన్నటి వరకు రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన బ్యాచ్ గవర్నర్ ను కలవడమేంటి. కాపాడమని కోరడమేంటి?వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎందరో అమాయకులను నరికి నరికి ఉసురు తీసేశారు. మాస్క్ అడిగిన వైద్యుడు సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఉదయగిరి నారాయణ, దుగ్గిరాల కరుణాకర్..ఇలా మందిని బలితీసుకున్నారో…లెక్కేలేదు. ఎంత మంది ఆస్తులను నాశనం చేశారో..అంతే లేదు.

పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు, దారుణాలు జగన్మోహన్ రెడ్డికి కనిపించలేదా? తెలుగుదేశం పార్టీ నాయకత్వం చరిత్రలో ఎప్పుడూ దాడులను ప్రోత్సహించలేదు, ప్రోత్సహించదు కూడా. వైసీపీ పాలనలో ఆ నలుగురు రెడ్లు మంత్రులు, సలహాదారులుగా దోచుకుతినడమే పనిగా పెట్టుకుని రెడ్లకున్న గౌరవాన్ని పోగొట్టారు.

ఉండే రెడ్లు చాలక ఇప్పుడు పద్మనాభరెడ్డి అంటూ మరో పెద్దమనిషి వారికి తోడయ్యారు. ప్రజలు మమ్మల్ని భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. వారి నమ్మకాలను నిలబెడుతూ జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన రాష్ట్రాన్ని ఎలా గాడిపెట్టాలో చూస్తున్నాం.

ఆర్థికంగా రాష్ట్రం కుదేలైపోయింది. నరేంద్ర మోదీ సహకారంతో దానిని ఎలా చక్కదిద్దాలో ఆలోచిస్తున్నాం. 151 సీట్లతో గెలిచిన రాజశేఖర్ రెడ్డి కుమారుడు, యువకుడైన జగన్మోహన్ రెడ్డి ఎంతోకొంత ప్రజలకు మంచి చేస్తాడనుకున్నాం. కానీ ఇంత రోత పుట్టించి, ఆ రెండు అక్షరాలను బ్రష్టు పట్టిస్తాడని ఊహించలేదు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మా తాతలు వారసత్వంగా ఇచ్చిన పొలాల పాసుపుస్తకాలపై ఆయన ఫొటోలేందో. మా భూముల్లో వాళ్ల పేరుతో హద్దు రాళ్లు ఏమిటో? అధికారం వస్తుంటుంది..పోతుంటుంది…కానీ రాష్ట్రాన్ని ఇంతగా భ్రష్టు పుట్టించిన రెడ్డి మరొకరు లేరు.