జగన్‌ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం!

– టీడీపీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి లక్ష్మయ్య

అమరావతి, మహానాడు: గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు… చేయరాని నేరాలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకున్నారు. వైసీపీ దౌర్జన్యాలకు పెట్టుబడిదారులు పారిపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి లక్ష్మయ్య అన్నారు.

ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే.. ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్ పంపించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడితే సుప్రీంకోర్టు జడ్జికి తప్పనిపించింది. అప్పటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడును ఏ ఆధారాలు లేకుండా 53 రోజులు జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వకుండా చేస్తే ఈ జడ్జీలు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. నెయ్యి కల్తీ జరిగిందని ఆధారాలు ఉన్నాయి.. స్కిల్ కేసులో ఆధారాలు లేవు. బెయిల్ ఇవ్వకుండా 53 రోజులు జైలు ఎందుకు పెట్టారు? జడ్జీల కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి.. వ్యవస్థలన్నీ నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి ప్రజలు ఆలోచించుకోవాలని లక్ష్మయ్య కోరారు.