అన్నిదారులూ బొప్పూడి ప్రజాగళం వైపే…!

కొద్దిసేపటి క్రితం హెలీకాప్టర్ లో బొప్పూడి ప్రజాగళం వేదికవద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్, నాగబాబు. సాయంత్రం 3.50కి సభావేదిక వద్ద ల్యాండ్ కానున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు. రాష్ట్రం నలుమూలల నుంచి బొప్పూడి ప్రజాగళం సభకు చేరుకుంటున్న టిడిపి-జనసేన-బిజెపి కార్యకర్తలు, ప్రజలు.

సభకు వచ్చే ప్రజలకు మార్గమధ్యలోనే భోజనం, తాగునీటి వసతులు కల్పించిన నిర్వాహకులు. విజయవాడ, గుంటూరు, ఒంగోలు వైపు నుంచి చీమలదండులా వేలసంఖ్యలో ప్రజాగళం సభకు చేరుకుంటున్న వాహనాలు. ఆర్టీసి పూర్తిస్థాయిలో బస్సులు ఇవ్వకపోవడంతో అందుబాటులో ఉన్న వాహనాల్లో స్వచ్చందంగా తరలివస్తున్న ప్రజలు.

పదేళ్ల తర్వాత తొలిసారిగా మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకేవేదికపైకి వస్తుండటంతో జాతీయమీడియా ప్రత్యేక ఆసక్తి. ఇప్పటికే డిల్లీనుంచి బొప్పూడి చేరుకున్న జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులు. బొప్పూడి ప్రజాగళం సభకు చరిత్రలో నిలచిపోతుందంటున్న టిడిపి, జనసేన, బిజెపి నేతలు. సభావేదిక వద్ద ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సాహంతో కార్యకర్తల కేరింతలు.

బొప్పూడి ప్రజాగళం సభా ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురంధ్రేశ్వరి

సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోడీ. గన్నవరం నుంచి వాయుసేన హెలికాప్టర్ లో 5గంటలకు బొప్పూడి చేరుకోనున్న ప్రధాని. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రజాగళం సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ. 6.10కి బొప్పూడి నుంచి తిరిగి గన్నవరం చేరుకుని, అక్కడినుంచి ప్రత్యేక విమానంలో డిల్లీకి మోడీ.

బొప్పూడి ప్రజాగళం ప్రాంగణంలో పండుగ వాతావరణం

బొప్పూడికి ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా టిడిపి, జనసేన, బిజెపి జెండాల రెపరెపలు. తమ పార్టీల జెండాలను చేబూని సభా ప్రాంగణానికి చేరుకుంటున్న మూడుపార్టీల కార్యకర్తలు. త్రిమూర్తులు (మోడీ, చంద్రబాబు, పవన్ ) రానుండటంతో ఆనందంతో కేరింతలు కొడుతున్న కార్యకర్తలు. రాష్ట్ర పునర్నిర్మాణానికి త్రిమూర్తుల భరోసా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్రప్రజలు. అధికార పార్టీ ఎన్ని ఆటంకాలు సృష్టించినా భారీఎత్తున సభా ప్రాంగణానికి వస్తున్న ప్రజానీకం.

సభా ప్రాంగణానికి చేరుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, నటరత్న బాలకృష్ణ

ప్రధాని మోడీ మాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5కోట్లమంది ప్రజలు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ధ్వంసమైన ఎపి పునర్నిర్మాణానికి మోడీ ఏవిధమైన భరోసా ఇస్తారోనని ఎదురుచూస్తున్న రాష్ట్రప్రజలు. ప్రజాగళం సభలో 40నిమిషాలపాటు ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ. చెరో 15నిమిషాల చొప్పున ప్రసంగించనున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రజాగళం వేదికపైకి మూడు పార్టీలకు చెందిన 30మందికి అనుమతి, ఇప్పటికే సభాప్రాంగణానికి చేరుకున్న కూటమి సీనియర్ నేతలు.

సభా ప్రాంగణానికి చేరుకున్న నవ్యాంధ్ర ఆశాకిరణం చంద్రబాబునాయుడు

ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రజాగళం సభా ప్రాంగణానికి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు. జయజయధ్వానాలతో చంద్రబాబుకు లక్షలాది ప్రజల ఘనస్వాగతం. అంచనాలకు మించి లక్షలాది ప్రజల రాకతో కిటకిటలాడుతున్న ప్రజాగళం సభా ప్రాంగణం. మరికాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోడీ.

ప్రజాగళం సభలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రసంగం

ఇది మరో కురుక్షేత్ర యుద్ధం, అయిదేళ్ల అరాచకపాలనకు చరమగీతం పాడే సమయం దగ్గర పడింది. 2014లో గుంటూరు సభను నేనే పర్యవేక్షించా, మళ్లీ 2024లో కూడా సభా నిర్వహణ బాధ్యత నాకు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా. కూటమి తిరుగులేని విజయానికి బొప్పూడి సభ సూచికగా నిలవబోతోంది. బొప్పూడి ఆంజనేయస్వామి సాక్షిగా రాబోయే ఎన్నికల్లో విజయదుందుభి మోగించబోయేది మనమే.