Mahanaadu-Logo-PNG-Large

వైసీపీ ప్రభుత్వ స్కీములన్నీ స్కాములే

ఒక్క రేషన్‌లోనే రూ.20 వేల కోట్లు దోచుకున్నారు
గూడూరులో రూ.6.6 కోట్లకు లెక్కలు చెప్పాలి
తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనుమూరి హరిశ్చంద్రారెడ్డి

గూడూరు, మహానాడు : వైసీపీ ప్రభుత్వంలో స్కీములన్నీ స్కాములేనని గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గూడూరు లోని తూర్పు వీధిలో ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో స్కీములన్నీ స్కాములేనని, ఒక్క రేషన్‌ అక్ర మ ఎగుమతితో రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిం చారు. జగన్‌ మే 14 నుంచి జూన్‌ ఒకటి వరకు యూరప్‌ పర్యటనకు అనుమతి కోరారని, రాష్ట్ర ప్రజలను తీసుకెళ్లాలని సూచించారు. గూడూరులో భూగర్భ పైపులైను అని రోడ్లను ధ్వంసం చేశారన్నారు. గూడూరు పట్టణంలోని 33 వార్డులకు కేటాయించిన 6.6 కోట్లతో ఏ అభివృద్ధి పనులు చేపట్టారో చెప్పాలని కోరారు. గూడూరుకు రింగు రోడ్డు వేస్తామని చెబుతున్నారని, ఎలా వేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. గూడూరులో పాశిం సునీల్‌కుమార్‌ విజయం ఖాయమని స్పష్టం చేశారు.