ప్రజల కోసమే పొత్తు

– జనసేన దళపతి పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ గందరగోళాలకి కారణాలు… ఏపీ విభజన, అర దశాబ్దంపాటు వైసీపీ పాలనలోని పాలసీ టెర్రరిజం. అవినీతి, ఇసుక ఇతర విలువైన ఖనిజాలు, సహజ వనరుల దోపిడీ, మద్యం మాఫియా. దేవాలయాలను అపవిత్రం చేయడం, ధార్మిక సంస్థ టీటీడీని ఏటీఎంగా మార్చడం.

బెదిరింపులు, ప్రతిపక్ష నాయకులు.. వారి పార్టీల కార్యకర్తలకు తీవ్ర అవమానాలకు గురి చేయడం, వారిపై భౌతిక దాడులు చేయడం, న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయడం, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను బెదిరించడం.. వారిని రాష్ట్రం వదిలి పారిపోయేలా చేయడం, ఎర్రచందనం స్మగ్లింగ్, 30 వేల మందికి పైగా మహిళల అదృశ్యం, దళితులపై అత్యధిక స్థాయిలో అఘాయిత్యాలు … ఈ జాబితా ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ అకృత్యాలన్నీ ముగింపు దశకు చేరుకునే సమయం ఆసన్నమైంది.

బీజేపీ-టీడీపీ- జనసేన కూటమి ద్వారా- శక్తిమంతమైన, ధృడ చిత్తంగల దార్శనికులు.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కచ్చితంగా వైసీపీ పాలనకు ముగింపు పలుకుతాం. మమ్మల్ని ఎన్డీఏ కూటమిలో భాగం చేసినందుకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

మీ మార్గదర్శకత్వంలో పని చేయడానికి ఏపీ ప్రజల కష్టాలు, బాధలను అంతం చేయడానికి మేమంతా ఎదురుచూస్తున్నాము. జేపీ నడ్డాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.. అమిత్‌ షా కి నా ప్రత్యేక ధన్యవాదాలు.