వినుకొండ, మహానాడు : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి యువత అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ముందుకు నడవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు