అమరావతి డెవలప్ మెంట్ ఫండ్ కు రూ. 1 లక్ష విరాళం

మండపేట, మహానాడు: మండపేట నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్స్ అమరావతి డెవలప్ మెంట్ ఫండ్ కు రూ.1 లక్ష విరాళం అందజేశారు. ఈ మేరకు ఆ చెక్కును బుధవారం మండపేట తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యాలయంలో శాసన సభ్యుడు వేగుళ్ళ జోగేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్బంగా కేబుల్ ఆపరేటర్స్ అందరికీ ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, కోలుపోటి సత్యనారాయణమూర్తి(అబ్బు), పర్వతిన వీర్రాజు, గొడవర్తి ఎర్రబ్బు, మేకా జేజిబాబు, తదితర్లు పాల్గొన్నారు.