తిరుపతి : వైసీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని బుధవారం అమర్నాథ్ రెడ్డి పరామర్శించారు. దాడి ఘటనను ఖండిరచారు. డిపాజిట్లు కూడా రావని, ఓడిపోతారన్న భయంతో చెవిరెడ్డి కుమారుడు యూనివర్సిటీ ఆవరణలో పులివర్తి నాని, ఆయన సెక్యూరి టీ గార్డులపై దాడి చేయడం బాధాకరమన్నారు. ఈవీఎం మిషన్లను భారీ బందోబస్తు యూనివర్సిటీలకు తీసుకెళ్లే టప్పుడు ప్రతి వాహనాలు చెక్ చేస్తారు. కానీ చెవిరెడ్డి అనుచరులు వాహనంలో రాళ్లు, గొడ్డళ్లు, మారణాయుధాలు ఉన్నా ఎందుకు చెక్ చేసి లోపలికి పంపించారు. అంటే ఇందులో పోలీసులు హస్తం కూడా ఉందని మండిపడ్డారు. చేతనైతే గెలిచి చూపించాలని, ఇలా అందరిపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పద్ధతులు మార్చుకోవాలని, లేదంటే తగిన పరిహారం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఘటనకు కారకులను వదిలేసి పోలీసులు టీడీపీ కార్యకర్తలపై కేసులు కట్టడం సిగ్గుచేటన్నారు.