సిట్‌ బృందానికి అంబటి ఫిర్యాదు

సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లిలో జరిగిన అల్లర్లపై విచారణ చేయాలని సిట్‌ అధికారులను వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు కోరారు. ఈ మేరకు నరసరావుపేట రూరల్‌ పోలీ సుస్టేషన్‌లో ఆదివారం సిట్‌ బృందాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. రూరల్‌ సీఐ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని, అల్లర్లలో ఆయన పాత్రపై విచారణ చేయాలని కోరారు.